Home  »  News  »  వంద కోట్ల హీరో సినిమా.. పట్టించుకునే నాథుడే లేడు!

Updated : Oct 10, 2025

 

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో సంచలనం సృష్టించాడు సిద్ధు జొన్నలగడ్డ. ముఖ్యంగా 'టిల్లు స్క్వేర్' సినిమాతో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనిపించుకున్నాడు. యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి సిద్ధు, ఆ తర్వాత ఎందుకనో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత చిత్రం 'జాక్'తో దారుణంగా నిరాశపరిచాడు. త్వరలో 'తెలుసు కదా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ 'తెలుసు కదా' అయినప్పటికీ, ఈ సినిమా గురించి జనరల్ ఆడియన్స్ కి పెద్దగా తెలియడం లేదనేది కాదనలేని సత్యం. (Telusu Kada)

 

'తెలుసు కదా' చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. సిద్ధు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారమే సమయముంది. అయినప్పటికీ, వంద కోట్ల హీరో సినిమాకి ఉండాల్సిన బజ్.. ఏమాత్రం కనిపించడంలేదు.

 

నిజానికి సిద్ధు గత చిత్రం 'జాక్'పై కూడా రిలీజ్ టైంలో ఓ రేంజ్ బజ్ ఏమీ క్రియేట్ కాలేదు. 'టిల్లు స్క్వేర్' తర్వాతి సినిమా అయినా.. 'జాక్'పై పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు 'తెలుసు కదా'పై 'జాక్' స్థాయి బజ్ కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో టిల్లుగా ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు సిద్ధు. మరి ప్రేక్షకులు సిద్ధుని టిల్లుగా తప్ప నార్మల్ గా చూడలేకపోతున్నారా? లేక సిద్ధునే ప్రేక్షకులను ఎక్సైట్ చేసే సినిమాలు చేయలేకపోతున్నాడా?. కారణమేదైనా.. 'టిల్లు స్క్వేర్' తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని మాత్రం పెద్దగా ఆకర్షించలేకపోతున్నాయి.

 

వాస్తవానికి సిద్ధు ఇమేజ్ కి సరిపోయేలా ట్రైయాంగిల్ లవ్ స్టోరీతోనే 'తెలుసు కదా' తెరకెక్కింది. టీజర్ కూడా.. అద్భుతం కాకపోయినా, ఆకట్టుకుంది. అయినా ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు. అక్టోబర్ 12న విడుదలవుతున్న ట్రైలర్ తోనైనా 'తెలుసు కదా'పై హైప్ వస్తుందేమో చూడాలి.

 

Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.