![]() |
![]() |

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda),రష్మిక మందన్న(Rashmika Mandanna)సినిమా పరిశమ్రలో తమదైన శైలితో దూసుకుపోతు అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. ఈ ఇద్దరు చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అలాంటి వార్తల్నిఇద్దరు ఖండించిన దాఖలాలు లేవు. పైగా ఆ ఇద్దరు ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్ట్ లతో పాటు, ఇతర ప్రదేశాలకి కలిసి వెళ్లిన పిక్స్ ని చూస్తే మాత్రం, ఆ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే వివాహబంధంతో ఒక్కటవుతారని, అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు నమ్ముతు వస్తున్నారు.
రీసెంట్ గా నిన్న శుక్రవారం ఆ ఇద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అన్ని మీడియా ఛానల్స్ ఈ విషయాన్నీ దృవీకరిస్తున్నాయి. ఎంతో సింపుల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల కుటుంబ సభ్యులతో పాటు,కొద్ది మంది బంధువులు, సన్నిహితులు అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి జరగనుందని కూడా అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే, ఈ ఇద్దరు అధికారకంగా తమ నిశ్చితార్థం విషయాన్ని ఎందుకు ప్రకటించలేదనే విషయం అర్ధం కావడం లేదు.
కెరీర్ పరంగా చూసుకుంటే ఈ ఇద్దరు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. రష్మిక బాలీవుడ్ లో 'థామా' అనే మూవీ చేస్తుండగా, దీపావళి కానుకగా అక్టోబర్ 21 న విడుదల కానుంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో పాటు 'కాక్టెయిల్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న దాంట్లోను చేస్తుంది. ఇక విజయదేవరకొండ నూతన దర్శకుడు రవికిరణ్ కోలా(Ravikiran Kola)దర్శకత్వంలో ఒక మూవీతో పాటు, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యియన్(Rahul Sankrityan)తో మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
![]() |
![]() |