![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)'ఓజి'(OG)తో సిల్వర్ స్క్రీన్ వద్ద తన ఛరిష్మాని కోనసాగిస్తు, రీసెంట్ గా 250 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన సత్య దాదాకి పెద్ద కొడుకు 'పార్థు' గా కనపడి మెప్పించిన నటుడు 'వెంకట్'(Venkat).రీసెంట్ గా ఆయన ప్రముఖ మీడియా ఛానెల్ 'తెలుగు వన్'(Telugu One)తో ఓజి కి సంబంధించిన పలు విషయాలని చెప్పడంతో పాటు, పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతు ఓజి కథ మొత్తం జరిగేది నా క్యారక్టర్ చనిపోవడం వల్లే. నేను పది రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. కళ్యాణ్ అన్నతో మాత్రం ఐదు రోజులు షూటింగ్ చేశాను. ఫస్ట్ షెడ్యూల్ కి ముందు ఎలక్షన్స్ ఇంకా పూర్తవకపోవడంతో, లొకేషన్ కి పొలిటికల్ లీడర్స్ వచ్చేవారు. దీంతో అన్నయ్యతో మాట్లాడానికి కుదరలేదు. ఎలక్షన్స్ పూర్తయ్యాక, డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నప్పుడు ముంబై లో షూటింగ్ లో మాత్రం అన్నయ్యతో మాట్లాడానికి కుదిరింది. ఈ షెడ్యూల్ లోనే అన్నయ్య చొక్కా కాలర్ పట్టుకునే సీన్ చేశాను. కొంత మంది హీరోలకి అలాంటి సీన్స్ నచ్చవు. కానీ ఎలాంటి అభ్యంతరం చెయ్యకుండా సీన్ ని చేసారని వెంకట్ . చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
1998 వ సంవత్సరంలో కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna)నిర్మాతగా, వైవిఎస్ చౌదరి(Yvs Chowdary)దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి' తో సోలో హీరోగా వెంకట్ సినీ రంగ ప్రవేశం చేసాడు. మొదటి చిత్రమైనా ఎలాంటి బెరుకు లేకుండా తన క్యారక్టర్ లో అద్భుతంగా చేసాడు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు(ANR)కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ లో సైతం చేసి మెప్పించిన వెంకట్, ఎటువంటి క్యారక్టర్ లోనైనా అవలీలగా నటించగలడు. తన సినీ కెరీర్ కి 'ఓజి' సెకండ్ ఇన్నింగ్స్ కి నాంది అని చెప్పుకోవచ్చు.
![]() |
![]() |