![]() |
![]() |

తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పైరసీ ముఠాని రీసెంట్ గా హైదరాబాద్(Hyderabad Police)పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చెయ్యడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలని స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై రీసెంట్ గా ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్ రాజు'(Dil Raju)మాట్లాడుతు పైరసీ భూతగాళ్ళని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులకి ధన్యవాదాలు, టెక్నాలజీతో పాటు నేరాలూ పెరుగుతున్నాయి. పైరసీతో ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతోంది. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా చేయాలని సీఎం అన్నారు. ఇకపై సినీ పరిశ్రమ నుంచి ఎవరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయరని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ప్రస్తుతం నిర్మాతగా తన హవా కొనసాగిస్తూనే పంపిణి దారుడిగాను పలు హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తున్నాడు. రీసెంట్ గా 'ఓజి'(OG)ని తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర లో దిల్ రాజు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
![]() |
![]() |