![]() |
![]() |

రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం 2022లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' వస్తోంది. అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీ టీం.. సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో భారీ ప్రీ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. (Kantara Chapter 1)
ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధముంది. ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టం రిషబ్ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే.. రిషబ్ ఆతిథ్యం ఇవ్వడం కూడా చూశాం. అందుకే ఇప్పుడు 'కాంతార 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలో మంచి ఫాలోయింది. పైగా స్పీచ్ అదరగొడతాడు. దీంతో కాంతార ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (Jr NTR)

కాగా, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్-2' ఆగస్టులో విడుదలై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్, ఆయన కాలర్ ఎగరేయడం హైలైట్ గా నిలిచింది. కానీ, రిజల్ట్ మాత్రం ఆయన ఊహించినట్టుగా రాలేదు. వార్-2 తర్వాత ఎన్టీఆర్ హాజరవుతున్న మొదటి ఈవెంట్ ఇదే. దీంతో ఈ వేడుక మరింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
![]() |
![]() |