![]() |
![]() |

భారతీయ సినిమా రంగంలో ప్రముఖ హీరోయిన్ 'అమీషా పటేల్'(Ameesha Patel)ది భిన్నమైన శైలి. సెటిల్డ్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించే హీరోయిన్స్ లో ముందు వరుసలో కూడా ఉంటుంది. అందుకే రెండున్నర దశాబ్దాల క్రితం కెరీర్ ని ప్రారంభించినా, రాసి కంటే వాసికి ప్రాధాన్యమిస్తూ తక్కువ సినిమాల్లోనే కనపడింది. కానీ హిట్ పర్సెంటేజ్ ఎక్కువ.
రీసెంట్ గా అమీషా ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతు హాలీవుడ్ సూపర్ స్టార్ 'టామ్ క్రూజ్'(Tom Cruise)అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా పెన్సిల్ బాక్స్ లో, బుక్స్ లో ఆయన బొమ్మ ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక ఫోటో కూడా టామ్ క్రూజ్ దే. అయన ఎప్పటికి నా క్రష్. ఆయన కోసం ఏం చెయ్యడానికి సిద్ధం. ఒక రాత్రి గడిపేందుకు కూడా వెనుకాడను . అవకాశం వస్తే పెళ్లి కూడా చేసుకునే దాన్ని. మీరు కనుక ఆయనతో పాడ్ క్యాస్ట్ నిర్వహిస్తే నన్ను పిలవండని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అమీషా చెప్పిన మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన 'టామ్ క్రూజ్' హాలీవుడ్ చిత్రాలకి ఐకాన్ అనే విషయం ప్రపంచ సినీ ప్రియులకి తెలిసిందే. 80 వ దశకం నుంచి అగ్ర హీరోగా కొనసాగుతు వస్తున్నాడు. ఆరుపదుల వయసులో కూడా, ఈ ఏడాది మే లో 'మిషన్ ఇంపాజిబుల్' తో వచ్చి తన సత్తా చాటాడు. ఇక అమీషా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీ 'బద్రి'తో తెలుగు సినిమా రంగానికి పరిచయమైంది.సరయు క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఇప్పటి వరకు హిందీ, తెలుగు,తమిళంలో సుమారు ముప్పై ఐదు చిత్రాల వరకు చేసిన అమీషా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం అమీషా వయసు యాభై సంవత్సరాలు. ముంబై(Mumbai)స్వస్థలం.

![]() |
![]() |