![]() |
![]() |
తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘మిరాయ్’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమా అందరి అంచనాలకు రీచ్ అయింది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ కెరీర్‌లో మరో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలుస్తోంది. వీకెండ్‌తో సంబంధం లేకుండా అన్ని రోజులూ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో హీరోతో సమానంగా మంచు మనోజ్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. దానికి తగ్గట్టుగానే పెర్‌ఫార్మెన్స్ ఉండడంతో అతనికి మంచి అప్రిషియేషన్ వస్తోంది. ఇక హరి గౌర సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
లీజ్‌కి ముందే ఈ సినిమాలోని ‘వైబ్..’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ చాలా నిరాశకు లోనయ్యారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ ఆ పాట లేని లోటు ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. దీంతో మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేక్షకులు, తేజ అభిమానులు. ఈ పాటను యాడ్ చెయ్యాలనే డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 23 నుంచి అన్ని సెంటర్స్‌లో ఈ పాటను జత చేశారు. ఈ పాట కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమే. ఈ పాట కోసమే ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 134 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ‘మిరాయ్’.. లాంగ్ రన్‌లో ఎలాంటి ఫిగర్స్‌ని రీచ్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |