![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 నుంచే ప్రీమియర్లు పడనున్నాయి. 'ఓజీ'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్.. ఆ అంచనాలను రెట్టింపు చేసింది. మరో రెండు రోజుల్లో 'ఓజీ' గర్జనను చూడబోతున్నామని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సెన్సార్ నుంచి ఊహించని షాక్ తగిలింది. (They Call Him OG)
ఓజీ సినిమాలో వయలెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని ప్రచార చిత్రాలతోనే క్లారిటీ వచ్చేసింది. అయితే వయలెన్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వస్తుందని అందరూ భావించారు. అయితే సెన్సార్ మాత్రం అనూహ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. పైగా కొన్ని వయలెంట్ సీన్స్ ని తొలగించి మరీ.. ఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. ఇది ఒక రకంగా 'ఓజీ' టీంకి షాక్ అనే చెప్పవచ్చు.
ఏ సర్టిఫికెట్ సినిమాలకు 18 ఏళ్ళ లోపు వయసు వారిని అనుమతించరు. దాంతో వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందుకే 'ఓజీ'కి యూ/ఏ సర్టిఫికెట్ వస్తే బాగుండేదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

![]() |
![]() |