![]() |
![]() |

'జయం'తో సినీరంగ ప్రవేశం చేసిన 'సదా', మొదటి చిత్రంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ లో పెర్ ఫార్మ్ ని ప్రదర్శించి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఈ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక 'ఫిలింఫేర్ అవార్డు'ని సైతం అందుకున్న సదా, ఆ తర్వాత ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు పొందింది.
వారం రోజుల క్రితం సదా తండ్రి 'సయ్యద్' మరణించడం జరిగింది. కానీ ఈ విషయాన్నీ సదా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా వెల్లడి చేసింది. అందులో ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతు 'మా నాన్న చనిపోయి వారం రోజులు అవుతుంది. కానీ ఈ వారం రోజులు ఒక యుగంలా అనిపిస్తుంది. ఆయన మరణం నా జీవితానికి అతి పెద్ద లోటు.నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు, మా అమ్మతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరు వ్యతిరేకించారు. కానీ మా నాన్న నన్ను ప్రోత్సహించి, నాతో పాటు షూటింగ్ కి వచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేసి వైద్య పరంగా ఎంతో మందికి సేవలు కూడా చేసాడు. ఆయన కూతురుగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానంటూ ఇనిస్టాగ్రమ్ లో వీడియో చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమె తండ్రి మరణానికి సానుభూతిని తెలియచేస్తున్నారు.
మహారాష్ట్ర లోని రత్నగిరి చెందిన సదా, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకొని సుమారు సుమారు నలభై చిత్రాల వరకు చేసింది. బుల్లి తెరపై పలు టి వి షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సదా, ఇప్పటి వరకు ఇలా పెళ్లి చేసుకోలేదు.

![]() |
![]() |