![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అభిమానాలను ఫిదా చేసింది. సెప్టెంబర్ 19న ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో థర్డ్ సింగల్ కూడా విడుదల కానుంది. ఇలా వరుసగా అదిరిపోయే కంటెంట్ వదులుతూ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న ఓజీ టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. (They Call Him OG)
'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నారు. దీని కోసం విజయవాడను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కి తెలుగునాట ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. పైగా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటిది విజయవాడ వేదికగా 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే.. లక్షల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది.
![]() |
![]() |