![]() |
![]() |

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే 'పెద్ది' శరవేగంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించడంతో, పెద్ది రేపు థియేటర్స్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పోతుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, మార్చి 27 2026 న విడుదల కానుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ కాగా, రెహమాన్(Ar Rehman)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ని 'కర్ణాటక' లోని మైసూర్(Mysore)లో చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్(Jani Master)నేతృత్వంలో సుమారు వెయ్యి మంది డాన్సర్స్ తో అత్యంత భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. వినాయకచవితి(Vinayaka Chavithi)సందర్భంగా రామ్ చరణ్, బుచ్చిబాబు, జానీ మాస్టర్, డిఓపి రత్నవేలుతో పాటు డాన్సర్స్ అందరు లొకేషన్ నుంచి 'గణపతి పప్పా మోరియా' అంటు అందరకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఇక 'జానీ మాస్టర్' పై తోటి డాన్సర్ 'శ్రేష్టి వర్మ చేసిన లైంగిక ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో కొన్ని రోజులో జానీ మాస్టర్ జైలులో ఉన్నాడు. జానీ మాస్టర్ అందుకోవాల్సిన
ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుని కూడా రద్దు చెయ్యడం జరిగింది. దీంతో జానీ మాస్టర్ కి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు చరణ్ లాంటి బడా స్టార్ తన సినిమాలో అవకాశం ఇవ్వడంతో, జానీ మాస్టర్ మళ్ళీ తన హవా కొనసాగించే అవకాశం ఉందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. రచ్చ మూవీ దగ్గనుంచి జానీ మాస్టర్ కి చరణ్ అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. రచ్చలోని 'డిల్లకు డిల్లకు' సాంగ్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిందే. ఈ సాంగ్ లో చరణ్ వేసిన స్టెప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రచ్చకి ముందు జానీ మాస్టర్ కొన్ని సినిమాలు చేసినా అవి చిన్న హీరోలవే. 'రచ్చ'నే తొలి బిగ్ మూవీ.

![]() |
![]() |