![]() |
![]() |

ప్రముఖ నటి నివేదా పేతురాజ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. రాజ్ హిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా రాజ్ హిత్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు నివేదా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటీవల నివేదా, రాజ్ హిత్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని సమాచారం. (Nivetha Pethuraj Wedding)
తమిళనాడుకి చెందిన నివేదా.. తమిళ్ తో పాటు, తెలుగులోనూ నటిగా మంచి గుర్తింపు పొందారు. 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. చివరిసారి 2023లో విడుదలైన 'బూ' అనే ద్విభాషా చిత్రంలో కనిపించిన నివేదా.. ప్రస్తుతం 'పార్టీ' అనే తమిళ సినిమా చేస్తున్నారు.

ఇక నివేదా పెళ్లి చేసుకోబోతున్న రాజ్ హిత్ ఇబ్రాన్ విషయానికొస్తే.. ఆయనది కూడా తమిళనాడే అయినప్పటికీ, దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ హిత్ రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. ఆ విషయం ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని గమనిస్తే అర్థమవుతుంది. మోడలింగ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రాజ్ హిత్.. వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ బాగానే ఉంటుందని, ముఖ్యంగా పలు ఖరీదైన కార్లు తన గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం.
మరో విషయం ఏంటంటే.. సినిమాల్లోకి రాకముందు నివేదా దాదాపు పదేళ్ళపాటు దుబాయ్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. పైగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరికీ కూడా రేసింగ్ అంటే ఇష్టం. ఒకే చోట ఉండటం, ఇద్దరి ఇష్టాలు కలవడం.. వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నివేదా.. పెళ్లి తర్వాత పూర్తిగా దుబాయ్ లో సెటిల్ అయ్యి సినిమాలకు దూరమవుతారో లేక అభిమానుల కోసం యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తారో చూడాలి.
![]() |
![]() |