![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానిగా గుంటూరు జిల్లా తెనాలిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన దాసరి కిరణ్ కుమార్(Dasari Kirankumar)ఆ పై నిర్మాతగా మారి రామదూత క్రియేషన్స్ పై 'జీనియస్, వంగవీటి, వ్యూహం వంటి పలు సినిమాలని నిర్మించాడు.
రీసెంట్ గా దాసరి కిరణ్ పై గాజుల మహేష్(Gajula Mahesh)అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుకునే వ్యక్తి ఈ నెల 18 న విజయవాడ పడమట పిఎస్ లో ఫిర్యాదు చేసాడు. తన ఫిర్యాదులో కిరణ్ నా వద్ద రెండు సంవత్సరాల క్రితం, వ్యాపార నిమిత్తం 4.5 కోట్ల రూపాయిలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భార్యతో పాటు విజయవాడలో ఉన్న కిరణ్ ఆఫీస్ కి వెళ్ళాను. కానీ కిరణ్ మనుషులు మమల్ని బయటకి నెట్టి వెయ్యడమే కాకుండా, దాడి చేసి గాయపరిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కిరణ్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
వ్యూహం చిత్రంలో అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిరంజీవిని పలు రకాలుగా విమర్శించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.
![]() |
![]() |