![]() |
![]() |

గతేడాది 'కల్కి 2898 AD'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్' వంటి పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'ఫౌజి' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో లీక్ అయింది. ఈ ఫొటోలో ప్రభాస్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫౌజి'. ఈ పీరియడ్ ఫిల్మ్ ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయింది. జూన్ లో ఈ మూవీ సెట్స్ నుంచి ప్రభాస్ పిక్ ఒకటి లీక్ అయింది. ఫార్మల్ డ్రెస్ వేసుకొని 'మిర్చి' మూవీ లుక్ ని గుర్తు చేశాడు ప్రభాస్. తాజాగా 'ఫౌజి' సెట్స్ నుంచి మరో పిక్ లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో టీ షర్ట్ ధరించి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు ప్రభాస్.
'డార్లింగ్', 'మిర్చి' వంటి సినిమాల్లో ప్రభాస్ లుక్స్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు 'ఫౌజి' నుంచి లీకైన పిక్స్ వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తున్నాయి. ప్రభాస్ లుక్ విషయంలో డైరెక్టర్ హను తీసుకుంటున్న స్పెషల్ కేర్ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |