![]() |
![]() |

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)ల ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఈ నెల 14 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 'దేవ'గా సెల్యులాయిడ్ పై రజనీ మరోమారు తన స్టైల్ తో మెప్పించడం, సైమన్ గా నాగార్జున నెగిటివ్ రోల్ లో, తన సత్తా చాటడంతో ప్రేక్షకులతో థియేటర్స్ నిండిపోతున్నాయి. స్టార్ హీరోలు అమీర్ ఖాన్(Aamir Khan),ఉపేంద్ర(Upendra)అతిధి పాత్రల్లో మెప్పించడం కూడా 'కూలీ'కి ప్లస్ అయ్యిందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
కూలీ తొలి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, కేరళలో 9 కోట్లు, కర్ణాటక 11 కోట్లు, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 7 కోట్లు, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో 74 కోట్లు, ఇలా వరల్డ్ వైడ్ గా 151 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టింది. ఈ మేరకు హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఫస్ట్ తమిళ మూవీ 'కూలీ' నే అని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇళయ దళపతి విజయ్ మూవీ లియో పేరు పై ఉండేది. ఆ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 146 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీంతో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద తనకున్న మానియా ని రజనీ మరో సారి చాటిచెప్పినట్టయింది.
రెండో రోజు చూసుకుంటే తమిళనాడులో 25 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, కర్ణాటక, కేరళ, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 5 కోట్లు, ఓవర్సీస్‌లో 20 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా,ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కూలీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 221 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |