![]() |
![]() |

సూపర్ స్టార్ 'మహేష్ బాబు(Mahesh Babu)'త్రివిక్రమ్'(Trivikram)కాంబినేషన్ లో 'జయభేరి'ఆర్స్ పై ప్రముఖ నటుడు 'మురళీమోహన్'(Murali Mohan)నిర్మించిన చిత్రం 'అతడు'(Athadu). 2005 అగస్ట్ 10 న విడుదలవ్వగా,మంచి విజయాన్ని అందుకుంది. అభిమానులు ఎప్పట్నుంచో ఈ మూవీని రీ రిలీజ్ చెయ్యాలని కోరుతు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9 న 'అతడు' వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ కానుంది. దీంతో మహేష్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది.
ఇక మహేష్ కి' ఓవర్ సీస్' మార్కెట్ ఎప్పట్నుంచో అడ్డాగా ఉన్న విషయం తెలిసిందే. హిట్ ,ప్లాప్ తో సంబంధం లేకుండా మహేష్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఓవర్ సీస్ లో మంచి వసూళ్ళని రాబట్టడమే కాకుండా, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అనేక రికార్డులు నెలకొల్పుతాయి. ఇప్పుడు అదే తరహాలో 'అతడు' ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న మూవీ లాగా, అడ్వాన్స్ బుకింగ్ లో ఇప్పటికే పదివేల డాలర్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఓవర్ సీస్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతుంది. ఖలేజా రీ రిలీజ్ తో ఓవర్ సీస్ లో ఆల్ టైం రికార్డు సృష్టించిన మహేష్ 'అతడు'తో వాటిని క్రాస్ చేయడం గ్యారంటీ అని అభిమానులు నమ్ముతున్నారు.
2005 లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా అతడు నిలిచింది. ఉత్తమ నటుడుగా మహేష్, బెస్ట్ డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాస్ నంది అవార్డ్స్ ని సైతం అందుకున్నారు. ఉత్తమ దర్శకుడి కోటాలో త్రివిక్రమ్ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుని సైతం అందుకున్నాడు. మహేష్ సరసన త్రిష జత కట్టగా సోను సూద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతంలో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా నేటికీ మారుమోగిపోతుంటాయి. మొత్తం 38 సెంటర్స్ లో వంద రోజులని పూర్తి చేసుకోగా,హైదరాబాద్ సుదర్శన్ లో 175 డేస్ జరుపుకుంది.

![]() |
![]() |