![]() |
![]() |

పహల్ గామ్(Pahalgam) దాడి తర్వాత మన సైనికులు పాకిస్థాన్ లో 'ఆపరేషన్ సిందూర్' ని నిర్వహించి తీవ్రవాదులని తుది ముట్టించారు. ఆ తర్వాత పాకిస్తాన్ మన దేశంపై దాడికి దిగడానికి ప్రయత్నిస్తే మన సైనికులు సమర్ధవంతగా తిప్పికొట్టారు. దీంతో పాకిస్థాన్, మనకి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే మన సైనికుల దెబ్బకి పాకిస్థాన్ తోక ముడవడంతో ఇప్పుడిప్పుడే యుద్ధ వాతావరణం సమసిపోతుందని చెప్పవచ్చు.
ఇక యుద్ధవాతారవరణ సమయంలో ఎంతో మంది సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ ని వ్యతిరేకిస్తు మన దేశానికీ మద్దతుగా పోస్ట్ లు చేసారు. అలా చేసిన వాళ్ళల్లో సౌత్ సినీ పరిశ్రమ నుంచే ఎక్కువగా ఉన్నారు. కానీ బాలీవుడ్ నుంచి ఎవరు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే ఇండియాకి మద్దతుగా ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ విషయంపై మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ (Maharashtra Police)సోషల్ మీడియా వేదికగా షారుఖ్,(Shah Rukh Khan)అమీర్,రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ప్రియాంకచోప్రా, అలియాభట్, దీపికా పదుకునే తో పాటు మరికొంత మంచి యాక్టర్స్ ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'డియర్ సెలబ్రటీస్, ఇప్పుడు అంతా సేఫ్ గా మారింది. మళ్ళీ మీ ఇన్ స్టాగ్రామ్ లోకి నెమ్మదిగా రావచ్చు. మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ ని అప్ సెట్ చేయాల్సిన పని లేదు. బాలీవుడ్ వాయిస్ ఎక్కడ? అంటు డిజైన్ చేసిన పోస్టర్ ఇపుడు వైరల్ గా మారింది..
దీంతో బాలీవుడ్(Bollywood)స్టార్స్ కి ఇండియన్ ఆడియెన్స్ అందించే వసూళ్లు మాత్రం కావాలి. కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం ఒక్కరు కూడా స్పందించరు, మహారాష్ట్ర పోలీస్ లు కరెక్ట్ కౌంటర్ ఇచ్చారనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. కొంత మంది అయితే రజనీకాంత్ హిట్ మూవీ జైలర్ లో పోలీస్ పవర్ చూపించిన టైటిల్ సాంగ్ ని క్యాప్షన్ గా ఉంచి షేర్ చేస్తున్నారు. మరి మహారాష్ట్ర పోలీసులు చేసిన పనిపై బాలీవుడ్ స్టార్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఫ్యూచర్ లో ఆయా నటుల సినిమాల కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం చుపిస్తాయేమో చూడాలి.
![]() |
![]() |