![]() |
![]() |

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ ప్రముఖ సినీనటి రేణుదేశాయ్(Renuu Desai)పర్యావరణ,జంతుప్రేమికురాలుగా కూడా తన సేవలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్(Hyderabad)కంచ గచ్చిబౌలి ఏరియాలోప్రభుత్వానికి,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hcu)విద్యార్థుల మధ్య 400 ఎకరాల గురించి జరుగుతున్న భూవివాదం గురించి మాట్లాడుతు సోషల్ మీడియా వేదికగా రేణుదేశాయ్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది.
అందులో ఆమె మాట్లాడుతు పబ్లిక్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్.రెండు రోజుల క్రితం హెచ్ సియు ఇష్యు గురించి తెలిసింది.దీంతో కొంత మందిని అడిగి కనుక్కున్నాను.ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.నాకు ఎలాగూ 44 ఇయర్స్ వచ్చేసాయి.రేపో మాపో పోతాను.కానీ నా పిల్లలతో పాటు అందరి పిల్లల ఫ్యూచర్ బాగుండాలి.అందుకు ఆక్సిజన్,నీరు చాలా అవసరం.డెవలప్ మెంట్ 100 పర్శంట్ కావాలి.కానీ బెగ్గింగ్ చేస్తు మిమ్మల్ని అడుగుతున్నాను.ఈ ఒక్క 400 ఎకరాలని వదిలేయండి.మన దగ్గర చాలా చోట్ల ల్యాండ్ ఉంది.డెవలప్ మెంట్ ని వేరే చోట చెయ్యండి.ఎన్నో రకాల చెట్లు,వైల్డ్ యానిమల్స్,పక్షులు ఆ ల్యాండ్ లో ఉన్నాయంటు కంచ గచ్చిబౌలి,సేవ్ ఫారెస్ట్,సేవ్ ది ట్రీస్,సేవ్ వైల్డ్ లైఫ్ అనే హ్యాష్ టాగ్స్ ని జోడించింది.
![]() |
![]() |