![]() |
![]() |

కార్తికేయ(Karthikeya)హీరోగా అజయ్ భూపతి(Ajay Bhupathi)దర్శకత్వంలో 2018 లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 తో తెలుగు నాట ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput).ఢిల్లీ కి చెందిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకీ మామ,తీస్ మార్ ఖాన్, జిన్నా,మాయాపేటిక,రక్షణ వంటి పలు చిత్రాల్లో నటించినా అవన్నీ కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి.అజయ్ భూపతి దర్శకత్వంలోనే 2023 లో వచ్చిన మంగళవారం మూవీ కొద్దిగా పర్వాలేదనిపించింది.
రీసెంట్ గా పాయల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు 'నటిగా కెరీర్ కొనసాగించడం చాలా కష్టమైన పని.అత్యంత కఠినమైనది కూడా ఒకటి.ఇండస్ట్రీలో రోజూస్ట్రగుల్స్, సవాళ్లే.ఇక్కడ టాలెంట్ కంటే నెపోటిజమే పని చేస్తుందంటు ట్వీట్ వేసింది.ఇప్పుడు
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.
పలు హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ భాషల్లోను సినిమాలు చేసిన పాయల్ చేతిలో కిరాతక అనే సినిమా మాత్రమే ఉంది.
.webp)
![]() |
![]() |