![]() |
![]() |

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఎల్2: ఎంపురాన్' (L2 Empuraan). మలయాళ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన 'లూసిఫర్'కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 27న విడుదలైన 'లూసిఫర్-2 మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ 'లూసిఫర్-2' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
'ఎల్2: ఎంపురాన్' సినిమా ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మలయాళ సినీ చరిత్రలో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా ఎంపురాన్ నిలిచింది. అలాగే వేగంగా ఈ ఫీట్ సాధించిన మలయాళ సినిమాగానూ రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఇండస్ట్రీ హిట్ దిశగానూ పరుగులు తీస్తోంది.
మలయాళ సినిమాల పరంగా రూ.242 కోట్ల గ్రాస్ తో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్' ఉంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన ఎంపురాన్.. ఇప్పుడు ఆ మూవీని క్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఎంపురాన్ జోరు చూస్తుంటే.. పది రోజుల వసూళ్లతోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా సరికొత్త రికార్డుని నెలకొల్పే అవకాశముంది.
![]() |
![]() |