![]() |

2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన 'మహాకుంభమేళా'(Maha Kumbhmela)లో జీవనోపాధి కోసం రుద్రక్షమాలలు,పూసల దండలు అమ్ముకుంటున్న'మోనాలిసా'(Monalisa)ఓవర్ నైట్ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అయితే తన కొత్త సినిమా'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మొనాలిసాని ఒక క్యారక్టర్ కి ఎంపిక చేసుకున్నాడు.
రీసెంట్ గా సనోజ్ మిశ్రా పై ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'నగరానికి చెందిన ఒక యువతి పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది.ఆమె తన ఫిర్యాదులో 2020 వ సంవత్సరంలో టిక్ టాక్,ఇనిస్టాగ్రమ్ ద్వారా సనోజ్ మిశ్రా తో పరిచయం జరిగింది.సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని తరచు ఫోన్ చేసి చెప్పేవాడు.ఒక రోజు ఝాన్సీ వచ్చి చెప్పిన చోటుకి రాకపోతే చనిపోతానని బెదిరిస్తే వెళ్ళాను.ఆ తర్వాత రిసార్ట్ కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు.ఆ వీడియో లతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు.పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు కూడా చేసాడని సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.దీంతో ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాని అరెస్ట్ చేశారనే కథనాలు వస్తున్నాయి.
2014 లో బేతాబ్ తో దర్శకుడిగా పరిచయమైన సనోజ్ మిశ్రా 'గాంధీగిరి,రామ్ కి జన్మ భూమి,లఫంగే నవాబ్,శ్రీనగర్,ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి పలు విభిన్న చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందాడు.'రీసెంట్ గా సనోజ్ తెరకెక్కించిన 'కాశీ టూ కాశ్మీర్' చిత్రం ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |