![]() |
![]() |

గాడ్ఆ ఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna)నట విశ్వరూపంలో మరో కోణాన్నిప్రేక్షకులకి పరిచయం చేసిన మూవీ 'ఆదిత్య 369(aditya 369)1991ఆగస్టు 18న విడుదలైన ఆదిత్య 369 ఎవరి ఊహకి అందని విధంగా గతాన్ని,భవిష్యత్తుని,వర్తమానంతో ఒక సరికొత్త లోకాన్ని ప్రేక్షకుల కళ్ళ ముందు ఉంచి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.టైం మిషన్ నేపథ్యంలోఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ తెరకెక్కిన మూవీ కూడా ఆదిత్య 369 నే.బాలయ్య ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని నింపగా అనేక రికార్డులు కూడా నెలకొల్పింది.ఇంతటి ప్రతిష్టాత్మక మూవీని శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా లెజండ్రీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao)తెరకెక్కించడం జరిగింది.
ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 4 న రీ రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్( Sivalenka Krishna Prasad)మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)గారు ఆదిత్య 369 ప్రమోషన్స్ కోసం దూరదర్శన్ లో 15 నుంచి 20 సెకన్ల పాటు యాడ్ ఇచ్చారు.కానీ ఈ విషయం ఎవరకి తెలియదని చెప్పుకొచ్చాడు.కృష్ణ ప్రసాద్ చెప్పిన ఈ మాటతో అగ్ర హీరోలు అప్పట్నుంచి కూడా ఎంత ఆప్యాయతగా ఉండే వాళ్ళో తెలుస్తుంది.
బాలకృష్ణ సరసన మోహిని(Mohini)హీరోయిన్ గా చెయ్యగా చంద్ర మోహన్,అమ్రిష్ పురి, బాబు మోహన్,సిల్క్ స్మిత,టిను ఆనంద్,గొల్లపూడి మారుతీరావు,అన్నపూర్ణ,మాస్టర్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

![]() |
![]() |