![]() |
![]() |
.webp)
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)ఈద్(Eid)కానుకగా ఈ నెల 30 న'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చెయ్యగా,తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్(Ar Murugadoss)దర్శకత్వం వహించాడు.సత్యరాజ్,కాజల్ అగర్వాల్,షర్మాన్ జోషి,అంజిని ధావన్,కిషోర్,సంజయ్ కపూర్,నవాబ్ షా,ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషించగా అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలా 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు.
సికందర్ తొలి రోజు ఇండియా వైడ్ గా 26 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.భారీ కాస్టింగ్ ఉన్నా కూడా సల్మాన్ గత చిత్రం టైగర్ 3 కంటే తక్కువ కలెక్షన్స్ రావడం పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.ఇక సికందర్ రిలీజ్ రోజు కంటే రోజు శనివారం చాలా వెబ్ సైట్స్ లో ప్లే అయ్యింది.దీంతో వెంటనే దాన్ని తొలగించాలని చిత్ర నిర్మాత సంబంధిత అధికారులని కోరగా ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
.webp)
![]() |
![]() |