![]() |
![]() |
.webp)
ఇండియన్ స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(Ms Dhoni)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ధోని ఎన్ని రకాల యాడ్స్ చేసినా కూడా సిల్వర్ స్క్రీన్ పై ధోని ని చూడాలని ఆయన అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు.మరి వాళ్ళ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గాని రీసెంట్ గా ధోని చేసిన ఒక యాడ్ మాత్రం అభిమానులకి ధోనిని హీరోగా చూసేలా చేసింది.
యానిమల్(Animal)ఫేమ్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga)దర్శకత్వంలో ధోని 'ఈ మోటోరోడ్'(E motorad)అనే ఎలక్రిక్ సైకిల్ కి యాడ్ చేసాడు.యానిమల్ లో రణబీర్ ఎలాంటి హెయిర్ స్టైల్ తో ఉంటాడో సేమ్ అలాంటి హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ స్టైల్ తో ధోని ఆ యాడ్ లో చేసాడు.నిమిషం 11 సెకన్లు ఉన్న ఆ హిందీ యాడ్ లో ధోని, సందీప్ మధ్య జరిగిన మాటలు కూడా యాడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచాయి.యాడ్ చివర్లో యానిమల్ మూవీ క్లైమాక్స్ లో రణబీర్(ranbir Singh)చేసిన సిగ్నేచర్ సైగ ని ధోని చేత కూడా సందీప్ రెడ్డి చేయించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
గత కొన్ని రోజులుగా రామ్ చరణ్(Ram Charan)బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో ధోని నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.అలాంటిదేమి లేదని రామ్ చరణ్ ఇటీవల అధికారకంగా ప్రకటించాడు.
.webp)
![]() |
![]() |