![]() |
![]() |
.webp)
ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar)తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు రేపిన భామ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రభాస్(Prabhas)లతో హరిహరవీరమల్లు(HariHaraveermallu)దిరాజాసాబ్(The raja saab)లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో హీరోయిన్ గా చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేస్తున్న పలువురు సినీ,టీవీ,యూట్యూబర్ లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి విసి సజ్జనార్ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా నిధి అగర్వాల్ JeetWin అనే ఒక క్యాసినో బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో నిధి మాట్లాడుతు JeetWin యాప్ లో గేమ్ ఆడండి,ఎదగండని చెప్పింది.దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ని కోరుతు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు ఇవ్వాల్సిందిగా సజ్జనార్ ప్రజలని కోరుతు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో హర్షసాయి,విష్ణుప్రియ,రీతు చౌదరి,టేస్టీ తేజ,సుప్రీత,పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల,కిరణ్ గౌడ్,సన్నీయాదవ్,సుధీర్‌రాజు, అజయ్‌లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.లోకల్ బాయ్ నాని అయితే రిమాండ్ లో ఉన్నాడు. బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో ఇంకా ఉన్నారని, వారిపై కూడా త్వరలోనే కేసులు నమోదు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.

![]() |
![]() |