![]() |
![]() |

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai)పై బిగ్ బాస్(Big Boss)ఫేమ్, ప్రముఖ నటి మిత్రాశర్మ(Mitraaw Sharma)కొన్ని నెలల క్రితం చేసిన ఆరోపణలు ఎంతగా సంచలనం సృష్టించాయో తెలిసిందే. తనని శారీరకంగా వాడుకున్నాడని,పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని మిత్రా చెప్పుకొచ్చింది.ఈ విషయం కోర్టు దాకా వెళ్లడం,మిత్రా చెప్పేది అబద్దమని హర్ష చెప్పుకొచ్చాడు.
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారి వి సి సజ్జనార్ ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేస్తు అమాయక ప్రజల జీవితాలని నాశనం చేస్తున్న యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటాడు.ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో మిత్రా శర్మ ఇనిస్టా వేదికగా హర్ష సాయి ని ఉద్దేశిస్తు 'ఎందరో జీవితాలని నాశనం చేసిన నిన్ను ఇప్పుడు కర్మ వెంటాడుతుంది.మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావంట కదా! ఈ రోజే బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అవ్వు.ఇప్పటికైనా సొసైటీకి,ఫాలోవర్స్ కి క్షమాపణ చెప్పు.బెట్టింగ్ యాప్స్ చేయనని ఒక వీడియో కూడా రిలీజ్ చెయ్యి.ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకి వస్తాను.హర్ష సాయి బెట్టింగ్ బండారం మొత్తం బయటపెడ్తాను.సజ్జనార్(Vc Sajjanar)వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి. నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ మంచి వ్యక్తి.గ్రేట్ జాబ్, నెక్స్ట్ జెనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని ఇనిస్టా వేదికగా ట్వీట్ చేసింది.
![]() |
![]() |