![]() |
![]() |
.webp)
బ్రహ్మానందం(Brahmanandham)ఆయన కుమారుడు రాజా గౌతమ్(Raja Gowtham)కాంబోలో ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బ్రహ్మఆనందం(Brahma Anandham)గౌతమ్, బ్రహ్మానందం తాత మనవళ్లుగా చెయ్యగా ప్రియావడ్డమాని,వెన్నెల కిషోర్,సంపత్,రాజీవ్ కనకాల,రఘుబాబు,తాళ్లూరి రామేశ్వరి కీలక పాత్రల్లో కనిపించారు.నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ పై రాహుల్ యాదవ్ నక్క నిర్మించడం జరిగింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా మార్చి 14 నుంచి 'ఆహా'లో స్టీమింగ్ కానుంది.సదరు ఆహా యాజమాన్యం అధికారకంగా కూడా వెల్లడి చెయ్యడం జరగగా,ఈ హోలీ సినీ ప్రేమికులకి సరికొత్త వినోదాన్ని అందించనుంది. బ్రహ్మానందం అనే క్యారక్టర్ లో గౌతమ్, ఆనంద రామ్మూర్తి గా బ్రహ్మానందం ఎంతో అద్భుతంగా నటించారు.మిగతా నటినటులు కూడా తన క్యారక్టర్ల పరిధి మేరకు తమ నటనతో మెప్పించారు.ఎంటర్ టైన్ మెంట్ కి కూడా ఎలాంటి లోటు లేదు.నటన మీద మక్కువతో బ్రహ్మానందం థియేటర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తు ఏ రోజుకైనా మంచి నటుడు కావాలనే లక్ష్యంతో ఉంటాడు.ఈ క్రమంలో తన నటనకి సంబంధించి మంచి అవకాశం వస్తుంది.
అందుకు భారీ మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి.ఆ డబ్బుల్ని అనాథాశ్రమంలో ఉండే తాత ఆనంద రామ్మూర్తి కోదాడలో ఉన్న తన పొలం అమ్మి ఇస్తానని తీసుకెళ్తాడు.కానీ ఆనంద రామ్మూర్తి ఆ ఊరిలో తాను ప్రేమిస్తున్న జ్యోతి అనే ఆవిడ కోసం బ్రహ్మానందాన్ని తీసుకెళ్తాడు.ఇలా ట్విస్టులతో ఈ కథ సాగుతుంది.చూసీ ఎంజాయ్ చెయ్యండి.
.webp)
![]() |
![]() |