![]() |
![]() |
.webp)
అక్కినేని నాగార్జున(Nagarjuna)రెండో నట వారసుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)కొంచం లాంగ్ గ్యాప్ తీసుకొని మురళి కిషోర్ అబ్బూరి(Murali Kishor Abburi)అనే నూతన దర్శకుడుతో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా ప్రకటిచకపోయినప్పటికీ ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనే వార్తలు కూడా
వచ్చాయి.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తొలి షెడ్యూల్‌ని 20 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరించనున్నారని, ఈ షెడ్యూల్ లో 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అవుట్ ఆఫ్ కంట్రీ దాటకుండా లోకల్‌లోనే కంప్లీట్ చేస్తారని,కథ కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని కూడా తెలుస్తోంది.వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి దసరాకి రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు.హీరోయిన్ విషయంలో శ్రీలీల లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
అఖిల్ నటించిన ఏజెంట్(Agent)2023 లో వచ్చింది.అక్కినేని అభిమానులు ఆ మూవీ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తన అప్ కమింగ్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.హోలీ సందర్భంగా మార్చి 14 నుంచి ఏజెంట్ సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.
![]() |
![]() |