![]() |
![]() |
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కి వచ్చి మూడు సంవత్సరాలే అయింది. చేసిన సినిమాలు కూడా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ క్రమంలోనే మార్చి 5 ఆమె పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, ఆమె అభిమానులు ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. వేడుక నిర్వహిస్తున్న ప్రదేశానికి మీనాక్షి చేరుకోగానే పేపర్ బ్లాస్ట్‌తో ఆమెకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. హర్షధ్వానాలు, కేరింతల మధ్య అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుక జరుపుకుంది మీనాక్షి. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసింది. వేడుక ప్రారంభం నుంచి చివరి వరకు నాన్‌స్టాప్‌గా అభిమానుల కేరింతలు చూసిన మీనాక్షి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. తన పుట్టినరోజు వేడుకను నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్నీటి పర్యంతమైంది. వాతావరణం ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోవడంతో అభిమానులు ఆమెను ఓదార్చారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారందరితోనూ ఫోటోలు దిగి అభిమానులను సంతోషపెట్టారు.
ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న హీరోయిన్లలో బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. డెంటల్ సర్జరీలో డిగ్రీ తీసుకున్న ఆమె రాష్ట్రస్థాయి స్విమ్మర్, బ్యాడ్‌మింటన్ ప్లేయర్ కూడా. అలాగే మోడలింగ్ రంగంలో కూడా తనదైన స్పెషాలిటీని క్రియేట్ చేసి పలు అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ ప్రస్తుతం ఎవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. 2019లో అప్‌స్టార్ట్స్ అనే హిందీ చిత్రం ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన మీనాక్షి.. రెండు సంవత్సరాలపాటు బాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించింది. ఫలితం లేకపోవడంతో సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమెకు ఆశించిన క్రేజ్ రాలేదు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి నటిస్తున్న రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
![]() |
![]() |