![]() |
![]() |

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'ఛావా'. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా భాషలలో కాకుండా, కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ.. వరల్డ్ వైడ్ గా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇంతటి సంచలనాలు సృష్టిస్తోన్న 'ఛావా' చిత్రం.. తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Chhaava Telugu)
'ఛావా' తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో 550 కి పైగా థియేటర్లలో తెలుగు వెర్షన్ విడుదలైంది. ఇప్పటికే పలువురు ప్రేక్షకులు హిందీ వెర్షన్ ను చూసినప్పటికీ, తెలుగు వెర్షన్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.3.03 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ డే వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తే.. తెలుగులోనూ ఫుల్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.
మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన 'ఛావా' చిత్రంలో శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.

![]() |
![]() |