![]() |
![]() |

సినిమా పేరు: రా రాజా
నటీనటులు:సుగి విజయ్,మౌనిక తదితరులు
రచన, నిర్మాత, దర్శకత్వం:బూర్లె శివప్రసాద్
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీ వాత్సవ్
ఎడిటర్: ఉప్పు మారుతీ
సంగీతం:శేఖర్ చంద్ర
బ్యానర్ :పద్మిని సినిమాస్
రిలీజ్ డేట్: 07- 03 -2025
భారతీయ సినీ చరిత్రలో మొట్టమొదటి సారి ఫేస్ చూపించకుండా కేవలం నటీనటుల డైలాగులని, ఎక్స్ ప్రెషన్స్ ని మాత్రమే చూపిస్తు తెరకెక్కిన మూవీ'రా రాజా'(Raa raja).ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా సంపాదించుకోగా,ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రాజా (సుగి విజయ్) ఒక కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లో జాబ్ చేస్తు తన భార్య రాణి (మౌనిక )తో కలిసి ఒక రిచ్ హౌస్ లో ఉంటుంటాడు.తన భార్య దెయ్యం అయ్యి తనని టార్చర్ చేస్తుందని చనిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతుంటాయి.పోలీసు స్టేషన్ కి వెళ్లి కూడా తన భార్యని చంపానని చెప్తాడు.కానీ మౌనిక బతికే ఉంటుంది.మరి రాజా ఎందుకు తన భార్య చనిపోయి దెయ్యం అయ్యి వేధిస్తుందని పోలీసులకి చెప్పాడు? అసలు పోలీసులతో చెప్పినట్టుగా రాజా తన భార్యని చంపాడా? అలా జరిగితే రాణి బతికే ఉంది కదా? రాజా ని వేధిస్తున్న దెయ్యం ఎవరు? అసలు ఈ కథలో రాణి క్యారక్టర్ ఏంటి? ఈ కథ యొక్క లక్ష్యం ఏంటనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
ఇలాంటి లైన్ తో ఈ రోజుల్లో ఇలాంటి కథ రావడం చాలా అవసరం.ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట గాని,పాత జంటలు అయినా అక్రమ సంబంధం మోజులో పడి,ఒకరికొకరు చంపుకుంటున్నారు.అలాంటి కథతోనే ఈ సినిమా వచ్చింది.కానీ కధనంలో,సన్నివేశాల్లో మంచి ఇంట్రెస్ట్ ని పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకొంచం బాగుండేది.ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఒకే పాయింట్ రావడం ప్రేక్షకుడికి అంతగా రుచించకపోవచ్చు.అలా కాకుండా రాణి క్యారెక్టర్ ని కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక గదిలో భర్త గురించి ఆలోచిస్తు అతనికి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చూపించాల్సింది.లేదా మరింత క్యూరియాసిటీ కలిగించే విధంగా రాజా తన గర్ల్ ఫ్రెండ్ తో, రాణి తన బాయ్ ఫ్రెండ్ తో వేరు వేరు గదుల్లో చాట్ చేస్తున్నట్టు చుపించాల్సింది.దీంతో ఎవరు ఎవర్ని చంపుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉండేది.ఆ ఇద్దరకీ పారలాల్ గా ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టుగా సస్పెన్సు ని మెయిన్ టైన్ చేస్తు ఇంటర్వెల్ టైంకి రాజా ఎప్పుడో రాణి ని చంపేశాడని చూపిస్తే ప్రేక్షకులు సరికొత్త థ్రిల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు.ఇక సెకండ్ ఆఫ్ లో రాజాని, రాణి దెయ్యంలా వేధించడం, రాజా చనిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడం, చివరకి దర్శకుడు తను అనుకున్న కథ లక్ష్యానికి వస్తే బాగుండేది.
నటీనటులు,సాంకేతిక నిపుణులపని తీరు
నటీనటుల ఫేస్ కనపడదు కాబట్టి వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏముండదు.పైగా మూవీలో కనపడేది రెండు క్యారక్టర్ లు మాత్రమే.దర్శకుడు,రచయిత శివప్రసాదే(Boorle Shivaprasad) కాబట్టి దర్శకుడిగా పర్లేదు గాని రచయిత గా మాత్రం ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది.ఇలాంటి సినిమాలకి డైలాగులు చాలా ముఖ్యం. కాబట్టి వాటి పై మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.కాకపోతే పోలీసు స్టేషన్ లో కామెడీ నటుడి డైలాగులు మాత్రం బాగా పేలాయి.శేఖర్ చంద్ర తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మూవీకి ఒక కొత్త లుక్ ని తీసుకొచ్చాడు.రాహుల్ శ్రీ వాత్సవ్ ఫొటోగ్రఫీ అయితే ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ ని కలిగించింది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూవీ చివర్లో వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది.
ఫైనల్ గా చెప్పాలంటే 'రారాజా' లాంటి మూవీ ప్రస్తుత జనరేషన్ కి అవసరమే.కానీ స్క్రీన్ ప్లే, డైలాగులు మరింత బలంగా ఉండుంటే 'రారాజా' మరింతగా ప్రేక్షకులకి నచ్చేదేమో
రేటింగ్ 2 .75 /5 అరుణాచలం
![]() |
![]() |