![]() |
![]() |

'మిస్టర్ బచ్చన్'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే.. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే కింగ్‌డమ్, RAPO 22, కాంతా వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో సైతం భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ 'బ్రహ్మ రాక్షస' సినిమా చేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని వార్తలొచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా భాగ్యశ్రీ ఎంపిక అయినట్లు వినికిడి. అంతేకాదు, ప్రభాస్ తో పాటు భాగ్యశ్రీ లుక్ టెస్ట్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.
తెలుగులో చేసింది ఒకటే సినిమా, అది కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ కి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాతో జాక్ పాట్ కొట్టినట్లే. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |