![]() |
![]() |

ప్రముఖ సినీ రచయిత,దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి(POsani Krishna Murali)ని రెండు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులాల మధ్య విబేధాలు సృష్టించేలా మాట్లాడటంతో అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని పై కేసు నమోదైంది.దీంతో హైదరాబాద్ వచ్చిన పోలీసులు పోసాని అరెస్ట్ చేసి ఓబులవారి పల్లి పరిధిలోని రాజంపేట కోర్టులో హాజరుపరచగా,కోర్టు పోసాని కి రిమాండ్ విధించింది.
దీంతో పోలీసులు పోసాని ని రాజంపేట పోలీసుస్టేషన్ కి తరలించారు.నిన్న రాత్రి ఛాతి నొప్పిగా ఉందని పోసాని చెప్పడంతో పోలీసులు పోసాని తెచ్చుకున్న మెడిసిన్ ని ఇవ్వడం జరిగింది.కానీ మళ్ళీ ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పి ఉందని అధికారులకి చెప్పడంతో,పోసాని ని వెంటనే రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.కానీ మళ్ళీ తీవ్రత ఎక్కువ కావడంతో కడప లోని రిమ్స్ కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు ఒక బులిటెన్ ని విడుదల చేసే అవకాశం ఉంది
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)డిప్యూటీ సిఏం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నారా లోకేష్(Nara Lokesh)పై కూడా,అత్యంత జుగుప్సాకర రీతిలో,సభ్య సమాజం తల దించుకునేలా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసాడు.ఈ విషయంపై కూడా పోసాని పై 13 కేసులు కూడా నమోదయ్యాయి.ప్రస్తుతం పోసాని పై BNS సెక్షన్ 196, 353 (2) మరియు 111 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయ్యింది.
![]() |
![]() |