![]() |
![]() |

సమంత(Samantha)రష్మిక(Rashmika Mandanna)తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన మంచి నటీమణులు.ఈ ఇద్దరి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉండటమే కాదు,ఆయా చిత్రాల్లో తాము పోషించిన క్యారక్టర్ ల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా కొలువు తీరారని కూడా చెప్పవచ్చు.'సిటాడెల్ హనీబన్నీ' అనే హిందీ వెబ్ సిరీస్ తో సమంత సందడి చెయ్యగా,పుష్ప 2 , 'చావా' వంటి చిత్రాలతో రష్మిక భారీ విజయాన్ని అందుకుంది.
సమంత 'సాకీ'(Saaki)అనే పేరుతో వస్త్ర వ్యాపారం చేస్తున్న విషయం అందరకి తెలిసిందే.చాలా మంది మధ్య తరగతి వాళ్ళకి,బ్రాండెడ్ దుస్తుల్ని వేసుకోవాలనే కోరిక ఉంటుంది.కానీ వాటిని కొనుక్కునే స్థోమత ఉండదు.అలాంటి వాళ్లందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా సాకీ బ్రాండెడ్‌ను తీసుకొచ్చానని సమంత ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తన బ్రాండ్ దుస్తుల్నిసినిమా రంగంలోని తన ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా పంపిస్తు ఉంటుంది.ఈ కోవలోనే రీసెంట్ గా రష్మిక కి వస్త్రాలని పంపించింది.రష్మిక కూడా తనకి వస్త్రాలు పంపించినందుకు సమంతకి సోషల్ మీడియా వేదికగా రిప్లై ఇచ్చింది.
సమంత కొన్ని నెలల క్రితం స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి మహాలక్ష్మి'అనే చిత్రాన్ని ప్రారంభించింది.ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.మరికొన్ని ప్రాజెక్ట్స్ లో కూడా చెయ్యబోతుందనే ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో సమంత నుంచి రాబోయే మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది.రష్మిక మాత్రం పలు క్రేజీ ప్రాజెక్స్ లో చేస్తు ఫుల్ బిజీగా ఉంది.
.webp)
![]() |
![]() |