![]() |
![]() |

తెలంగాణ పల్లెల్లోని కొంత మంది రైతుల జీవితాల్లో జరిగే సంఘటనలని కళ్ళకి కట్టినట్టు చూపించిన చిత్రం 'బాపు'(Baapu).బ్రహ్మాజీ(Brahmaji)ఆమని(aamani),బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి,అవసరాల శ్రీనివాస్,ధన్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ నెల 21 న థియేటర్స్ లో అడుగుపెట్టిన 'బాపు' విడుదలైన అన్ని చోట్ల మంచి ప్రేక్షకాదరణని దక్కించుకుంది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమయ్యింది.మార్చి 7 నుంచి ప్రముఖ ఓటిటి మాధ్యమం'జియో హాట్ స్టార్'(Jio Hot Star)ద్వారా స్ట్రీమింగ్ కానుంది.దీంతో రిలీజైన రెండు వారాలకే 'బాపు' ఓటిటి లో అడుగుపెట్టి, ప్రేక్షకులకి ఇంటిల్లిపాది సరికొత్త వినోదాన్ని అందించనుంది.'దయ' దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రాజు,సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా దృవన్ సంగీతాన్ని అందించాడు.
తెలంగాణలోని మారుమూల పల్లెటూరుకి చెందిన 'మల్లన్న'ఒక బీద రైతు.అప్పు చేసి ఎకరం పొలంలో పంట వేస్తాడు.తన కొడుకు చేసిన తప్పు వల్ల పంట చేతికందకుండా పోతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు తమ డబ్బు ఇవ్వమని వేధిస్తుంటారు.దీంతో వాళ్ళ బాధలు భరించలేని మల్లన్న ఆత్మహత్య చేసుకుంటే పంట భీమా డబ్బులు వస్తాయని భావించి,ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.ఈ విషయం భార్య సరోజ కి చెప్తే,నువ్వెందుకు చావడం మీ నాన్న రాజయ్యని చంపుదామని అంటుంది.కొన్ని పరిణామాల తర్వాత మల్లన్నతన అప్పు విషయాన్నీ తండ్రి రాజయ్య కి చెప్పి, రైతు భీమా కోసం ఆత్మహత్య చేసుకోమని సలహా ఇస్తాడు.మరి ఆ తర్వాత ఏం జరిగిందనేదే 'బాపు' మూవీ.భావోద్వేగాలతో పాటు,ఎంటర్ టైన్ మెంట్ అంశాలు సమపాళ్లలో ఉండటం బాపు' మూవీ ప్రత్యేకత.
![]() |
![]() |