![]() |
![]() |
.webp)
తెలుగు సినిమా,తెలుగు జాతికి ప్రపంచపటంలో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారకరామారామారావు.(Ntr)ఎన్టీఆర్ అంటే కేవలంపేరు కాదు,ఇట్స్ ఏ బ్రాండ్ అనేలా సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు.ఆయన నటవారసుడు బాలకృష్ణ(Balakrishna)తన తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తునే,రాజకీయాల్లోను ముందుకు దూసుకుపోతు హ్యాట్రిక్ ఏంఎల్ఏ గా ప్రజాసేవ సేవలో కొనసాగుతు వస్తున్నారు.కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నటనా రంగంలో అత్యుతమ ప్రతిభ కనపర్చినందుకు బాలయ్య కి పద్మభూషణ్ ని కూడా ప్రకటించింది.
రీసెంట్ గా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా(Krishna Jilla)నిమ్మకూరు(Nimmakuru)వెళ్లడం జరిగింది. బాలయ్య పద్మభూషణ్(Padma Bhushan)సాధించిన మొదటిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్థులు ఆయనకి ఘనస్వాగతం పలికారు.గ్రామంలో ఉన్న ఎన్టీఆర్,తల్లి బసవతారకం విగ్రహాలకి పూలమాలలు వేసి నమస్కరించారు.అనంతరంగ్రామస్థులతో మాట్లాడి గ్రామానికి సంబంధించిన పలు విషయాల గురించి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతు తన తండ్రి ఎన్టీఆర్ కి భారతరత్న(Bharat Rathna)త్వరలోనే వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.
బాలయ్య ఇటీవలే 'డాకు మహారాజ్'(Daku Maharaj)తో తన కెరీర్ లో మరో హిట్ ని అందుకున్నాడు.ప్రస్తుతం ఓటిటిలో డాకు మహారాజ్ తన హవాని కొనసాగిస్తోంది.ఇక తన అప్ కమింగ్ మూవీ అఖండ 2(Akhanda 2)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.అఖండ పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది.

![]() |
![]() |