Home

»

Latest News

జపనీస్‌ కోసం మరింత ఎఫెక్టివ్‌గా ‘దేవర’ ట్రైలర్‌.. ఎన్టీఆర్‌ జపాన్‌ టూర్‌ ఫిక్స్‌!

Feb 27, 2025 1:30PM

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘దేవర’ మంచి మాస్‌ హిట్‌గా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్‌ చేసింది. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా ఎన్టీఆర్‌కి మంచి పేరు తెచ్చింది. థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ కూడా తన సత్తా చాటింది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ పెర్‌ఫార్మెన్స్‌, జాన్వీ కపూర్‌ గ్లామర్‌ ఈ సినిమా ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. అంతేకాదు, అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయింది.

ఈ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్‌ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించింది చిత్ర యూనిట్‌. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ జపాన్‌లో రిలీజ్‌ అయింది. అక్కడ బాహుబలి కంటే ఎక్కువ కలెక్ట్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌. దాంతో అక్కడ కూడా ఎన్టీఆర్‌కి ఫ్యాన్స్‌ పెరిగారు. మార్చి 28న ‘దేవర’ జపాన్‌లో రిలీజ్‌ కాబోతుండగా దానికి సంబంధించిన ప్రమోషన్స్‌ ఇప్పటికే స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా అక్కడ ఉన్న తన ఫ్యాన్స్‌తో మీడియాతో వర్చువల్‌గా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్‌. ‘దేవర’ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. తెలుగు ట్రైలర్‌ కంటే జపాన్‌ వెర్షన్‌ ట్రైలర్‌ మరింత గ్రిప్పింగ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎన్టీఆర్‌ మార్చి 22న జపాన్‌ బయల్దేరనున్నారు. అతనితోపాటు దర్శకుడు కొరటాల శివ వెళుతున్నారు. మరి ‘దేవర’ జపాన్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com