![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)గత నెల సంక్రాంతికి 'డాకు మహారాజ్'(Daku Maharaj)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.జనవరి 12 న విడుదలైన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.100 కోట్ల క్లబ్ లో కూడా చేరి,సిల్వర్ స్క్రీన్ వద్ద బాలయ్య కట్ అవుట్ కి ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్పింది.ముఖ్యంగా పలు షేడ్స్ లో బాలయ్య ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు,ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.ఫిబ్రవరి 21 నుంచి ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో 'డాకు మహారాజ్' స్ట్రీమింగ్ అవుతు వస్తుంది.
.తెలుగుతో పాటు హిందీ,మలయాళం,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న డాకు మహారాజ్, మొత్తం 18 దేశాల్లో వ్యూయర్స్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచినట్టుగా తెలుస్తుంది.దీంతో కేవలం రెండు రోజులకే ఇంతవరకు ఏ భారతీయ చిత్రానికి దక్కని ఆదరణని 'డాకు మహారాజ్' సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.బాలయ్య నట విశ్వరూపానికి ఆయా భాషలకి చెందిన ప్రేక్షకులు మెస్మరైజ్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, చూపు పక్కకి తిప్పుకోకుండా చేస్తున్న విజువల్స్ ,ఇంటర్వెల్ బ్యాంగ్,బాలయ్య చేసిన హార్స్ సీన్స్,సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మలయాళంలో అయితే పరిస్థితి ఎలా ఉందంటే 'డాకు మహారాజ్' ని థియేటర్ రిలీజ్ చేసుండాల్సింది. కనీసం ఇప్పుడైనా థియేటర్ లో రిలీజ్ చెయ్యండని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.దీన్ని బట్టి మలయాళ ప్రేక్షకులు'డాకు మహారాజ్ ని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు.నిజానికి 'డాకు మహారాజ్' రిలీజ్ టైం లో మలయాళ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ చేసారు.అలాంటింది 'డాకు మహారాజ్' ఓటిటి లో అడుగుపెట్టగానే బాలయ్య నట విశ్వరూపాన్నికి మలయాళీలు సలాం కొడుతున్నారు.బాలయ్య కి మలయాళంలో ఇప్పుడు భారీ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.
.webp)
'డాకు మహారాజ్' ని హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్(Sitara Entertainment)నిర్మించగా బాబీ(Bobby)దర్శకత్వం వహించాడు.ప్రగ్య జైస్వాల్(Pragya Jaiswal)శ్రద్ధ శ్రీనాధ్(Sradha Srinadh)ఊర్వశి రౌతేలా, బాబీడియోల్, చాందిని చౌదరి,షైన్ టామ్ చాకో,సచిన్ కెడ్కర్, విటి గణేష్,వేద అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.'డాకు మహారాజ్' ఓటిటి రికార్డు అయితే ఇప్పుడు నేషనల్ వైడ్ డిబేట్ అయ్యింది.
![]() |
![]() |