![]() |
![]() |

'లోక నాయగన్' కమల్ హాసన్(kamal Haasan)నట ప్రస్థానానికి ఉన్న చరిష్మా అందరకి తెలిసిందే.బాల నటుడుగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన కమల్,తన నట జీవితంలో ఇంతవరకు పోషించని పాత్ర లేదు.నటనకే గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనత కూడా ఆయన సొంతం.నటుడుగా తనని ఉన్నత శిఖరాలపై కుర్చోపెట్టిన ప్రజలకి సేవ చెయ్యాలనే ఆలోచనతో 2018 ఫిబ్రవరి 21 న 'మక్కల్ నీది మయ్యం' అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు.రీసెంట్ గా ఆ పార్టీ యొక్క 8 వ వ్యవస్థాపక దినోత్సవం చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కమల్ కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతు 'మక్కల్ నీది మయ్యం'(Makkal Needi maiam)ని స్థాపించి 8 సంవత్సరాలు.చిన్నారిలా ఇప్పుడిప్పుడే ఎదుగుతుంధి.రాజకీయాల్లోకి 20 ఏళ్ళ క్రితమే వచ్చి ఉంటే ఇప్పుడు నా ప్రసంగం,నా స్థాయి వేరేలా ఉండేది.ఈ సంవత్సరం మన పార్టీ గొంతు పార్లమెంట్ లో వినబడబోతుంది.వచ్చే ఏడాది అసెంబ్లీలోను అడుగుపెడతాం.2026 ఎన్నికలకి అందరు సన్నద్ధమవ్వాలి.హిందీ భాష అమలకు వ్యతిరేకంగా తమిళ ప్రజలు తమ ప్రాణాలని కూడా త్యాగం చేసారు.తమిళులకు,వారి పిల్లలకు తమ మాతృ భాష ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు.భాష సమస్యలని ఎవరు కూడా తేలికగా తీసుకోవద్దంటు హెచ్చరించాడు.
గత తమిళనాడు ఎన్నికల్లో 'మక్కల్ నీది మయ్యం' పార్టీ పోటీ చెయ్యగా కమల్ తో పాటు ఆయన పార్టీ అభ్యర్థులందరు ఓటమి చెందారు.సినిమాల విషయానికి వస్తే కమల్ ప్రస్తుతం మణిరత్నం(Mani Rathnam)దర్శకత్వంలో తగ్ లైఫ్(Thug Life)అనే మూవీ చేస్తున్నాడు. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్(Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ 3 (Indian 3)'కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |