![]() |
![]() |
.webp)
భారతీయ సినిమాకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అతి తక్కువ మంది దర్శకుల్లో శంకర్(Shankar)కూడా ఒకరు.మూడు దశాబ్దాల క్రితం'జెంటిల్ మెన్'తో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.వాటిల్లో రజనీకాంత్(Rajinikanth)హీరోగా వచ్చిన 'ఎంథిరన్'(Enthiran)కూడా ఒకటి. 2010 లో వచ్చిన ఈ మూవీ తెలుగులో 'రోబో'(Robo)గా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ మూవీ కథని శంకర్ కాపీ రైట్ చటంలోని సెక్షన్ 36 ని ఉల్లంఘించి 'జిగుబా'(Jiguba)అనే కథ నుంచి కాపీ కొట్టాడని ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ శంకర్ కి చెందిన 10 కోట్ల స్థిరాస్థులని అటాచ్ చేసింది.
ఇప్పుడు ఈ విషయంపై శంకర్ మాట్లాడుతు 'ఈడి' నా స్థిరాస్థులని అటాచ్ చెయ్యడం నన్ను చాలా బాధిస్తుంది.'ఎంథిరన్' కథ తనదే అని అరూర్ తమిళనాథన్ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టి వేసి,కాపీ రైట్ ఉల్లంఘన జరగలేదని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది.కానీ 'ఈడి' కేవలం 'ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా' నివేదిక ఆధారంగానా ఆస్తులని అటాచ్ చేసింది.న్యాయపరమైన వాస్తవాలని చట్టప్రకియ దుర్వినియోగం చేస్తుందని తన ఆవేదనని వెల్లబుచ్చాడు..
రోబో కథ తనదే అంటు 2011 లో అరూర్ తమిళనాథన్ కేసు వెయ్యడం జరిగింది.'ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో అరూర్ కి మద్దతుగా నిలవడమే కాకుండా,ఎంథిరన్ కి,జిగుబాకి మధ్య పోలికలున్నాయని తన నివేదికలో పేర్కొంది.ఈ నివేదిక ఆధారంగానే ఈడి శంకర్ కి సంబంధించిన 10 కోట్ల ఆస్తులని తాత్కాలికంగా అటాచ్ చేసింది.
![]() |
![]() |