![]() |
![]() |

వెబ్ సిరీస్ : సమ్మేళనం
నటీనటులు: ప్రియా వడ్లమణి, గణాదిత్య, వినయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం , నూతక్కి బిందు భార్గవి, జీవన్ ప్రియా రెడ్డి,
ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ: శ్రవణ్ జి. కుమార్
మ్యూజిక్: యశ్వంత్ నాగ్
నిర్మాతలు: సునయని.బి, సాకేత్.జె
రచన, దర్శకత్వం: తరుణ్ మహదేవ్
ఓటీటీ: ఈటీవీ విన్
కథ:
అర్జున్, రాహుల్, శ్రేయ ముగ్గురు ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు సిటీలో ఒకే ఫ్లాట్ లో ఉంటూ ఎవరి జాబ్ కి వాళ్లు వెళ్లి వస్తుంటారు. ఇదే సమయంలో అర్జున్ ఫ్రెండ్ రామ్ ఊరి నుండి సిటీకి వస్తాడు. రామ్ చాలా జీనియస్. అతనికి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతణ్ణి అర్జున్ సిటీకి పిలికిస్తాడు. రామ్ చాలా సింపుల్ గా కనిపించడం, నిదానంగా ఉండటం శ్రేయకి చిరాకును కలిగిస్తుంది. ఆ తర్వాత అతని గురించి తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేస్తుంది శ్రేయ. మరోవైపు మేఘన అనే అమ్మాయిని అర్జున్ లవ్ చేస్తూ ఉంటాడు. అయితే తొలి చూపులోనే మేఘనను చూసిన రామ్ మనసు పారేసుకుంటాడు. కానీ ఆ విషయాన్ని మనసులోనే దాచుకుంటాడు. రామ్ ప్రవర్తన, టాలెంట్ చూసిన మేఘన కూడా అతని పట్ల అట్రాక్ట్ అవుతుంది. అయితే ఆమె కూడా ఆ విషయాన్ని అతనికి చెప్పడానికి తడబడుతుంది. రామ్ మనసులో ఏముందనేది శ్రేయ గమనిస్తుంది. తాను సిటీలో ఉండటానికి ఆశ్రయం కల్పించిన అర్జున్ ను మోసం చేయకూడదని రామ్ అనుకుంటాడు. ఆ సమయంలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటనతో ఎవరెవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడమనే కాన్సెప్ట్ తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఇందులో దర్శకుడు సమ్మేళనం కథని నడిపిన తీరు కాస్త భిన్నంగా ఉంది. పెద్దగా ట్విస్ట్ లేం లేవు.. రొమాన్స్ లేదు.. అసభ్య పదజాలం వాడలేదు..సింపుల్ గా అలా వెళ్తుంది.
దర్శకుడు కథలో బలమైన ఎమోషన్స్ రాసుకున్నప్పటికి అవి పెద్దగా కనెక్ట్ కావు. ఎందుకంటే స్క్రీన్ ప్లే సెట్ అవ్వలేదు. ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. మొదటి ఎపిసోడ్ లో రామ్ పాత్ర చూడగానే వామ్మో ఏంట్రా బాబు ఈ క్యారెక్టర్ అని అనుకొని చాలా మంది సిరీస్ చేసేవాళ్ళు డ్రాప్ అవ్వొచ్చు కానీ అసలు కథ సెకెండ్ ఎపిసోడ్ నుండి సాగుతుంది.
ఫస్ట్ ఎపిసోడ్ లో క్యారెక్టర్లని పరిచయం చేయడానికి కాస్త సాగదీత కన్పిస్తుంది. అయితే రెండు మూడు ఎపిసోడ్ లలో ఫన్, ఎమోషన్స్, స్నేహం ఇలా అన్నింటిని సరిగ్గా వాడుకుంటు తీసుకెళ్ళాడు దర్శకుడు. కథా వస్తువు సింపుల్.. ఒక రచయిత తన పాయింటాఫ్ లో ఒక్కో క్యారెక్టర్ ఎలా ఉంటుందో.. ఒక్కో ఎమోషన్ ని, ఒక్కో సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా లైఫ్ మలుపుతిరుగుతుందో చెప్పడం బాగుంది. ప్రేమ, స్నేహం ఈ రెండూ కూడా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక రకంగా ఈ రెండూ కూడా వ్యక్తిత్వానికి రెండు కళ్ల మాదిరిగా అనిపిస్తాయి. ఒకదాని కోసం ఒకటి పణంగా పెట్టవలసి వచ్చినప్పుడు సున్నితమైన మనసులు పొందే భావోద్వేగాలే ఈ కథ.
పనిమనిషి పాత్రతో కాస్త కామెడీ జనరేట్ అయ్యింది. లవ్ ట్రాక్ మాములుగానే ఉంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సింపుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ యూత్ కి కొంతవరకూ కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ప్రియ వడ్లమణి, గణాదిత్య సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కొత్తదనం లేని కథ.. వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేష్
![]() |
![]() |