![]() |
![]() |
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అంటూ శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
‘మా అమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆస్పత్రిలో చేర్పించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమ్మ కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్న మాట వాస్తవమే. కానీ, ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి అమ్మ ఆరోగ్యం గురించి ఊహాగానాలు ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటున్న మీకు నా ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశారు.
![]() |
![]() |