![]() |
![]() |

'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)తనయుడు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(Chhatrapati Shambaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'చావా'(Chhaava)ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీలో'శంభాజీ మహారాజ్' గా విక్కీ కౌశల్(Vicky Kaushal)ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక(Rashmika mandanna)నటించారు.మొదటి ఆట నుంచే హిట్ టాక్ ని తెచ్చుకున్న 'చావా' రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుపోతుంది.కొన్ని ఏరియాల్లో షోస్ కూడా పెంచారంటే 'చావా' హిట్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.చివరి నలభై నిముషాలు అయితే విక్కీ కౌశల్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు చిత్ర హింసలకి గురించి చేసే సన్నివేశాల్లో అయితే వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
'చావా' ని రీసెంట్ గా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా(Aakash Chopra)వీక్షించడం జరిగింది.ఇప్పుడు ఈ విషయంపై 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'చావా చూసాను.చాలా అద్భుతంగా ఉంది.దైర్యం,నిస్వార్ధం,అకింత భావం కలిగిన సినిమా ఇది.నిజాయితీగా కొన్ని ప్రశ్నలు వెయ్యాలనుకుంటున్నాను.'ఛత్రపతి శంభాజీ మహారాజ్' గురించి మనకు పాఠశాలలో ఎక్కడ నేర్పించలేదు.అసలు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ ప్రస్తావించలేదు.అక్బర్ గొప్ప నాయకుడని,న్యాయంగా పరిపాలించిన చక్రవర్తి అని రాసుకొచ్చారు.ఢిల్లీలో ఒక పెద్ద రోడ్ కి ఔరంగ జేబు పేరు కూడా పెట్టారు.అలా ఎందుకు చేసారని పోస్ట్ చేసాడు.
ఆకాష్ చేసిన పోస్ట్ కి ఒక నెటిజన్ స్పందిస్తు 'మీరు చరిత్ర నేర్చుకోలేదా' అని ట్వీట్ చెయ్యగా నేను టాపర్ ని చరిత్రలో 80 శాతం మార్కులు వచ్చాయని ఆకాష్ రిప్లై ఇచ్చాడు.ఆకాష్ ట్వీట్ కి కొంత మంది మద్దతు తెలుపుతుండగా,మరికొంత మంది మాత్రం అనవసర రాద్ధాంతం చెయ్యవద్దంటూ ట్వీట్ లు చేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా కి చెందిన ఆకాష్ 2003 లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటమ్ చేసాడు.స్వతహాగా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిన చోప్రా 2003 నుండి 2004 చివరి వరకు భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు.ఆ తర్వాత ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లకి కామెంటరేటర్ గా పని చేసి ప్రస్తుతం యూట్యూబర్ గా తన సత్తా చాటడమే కాకుండా,వయాకామ్ 18 కోసం క్రికెట్ కి సంబంధించి హిందీ వ్యాఖ్యానం చేస్తున్నాడు.
![]() |
![]() |