![]() |
![]() |

'సందీప్ కిషన్'(Sandeep Kishan)హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు 'త్రినాథరావు నక్కిన'(Trinadarao Nakkina)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మజాకా'(Mazaka)రీతు వర్మ హీరోయిన్ గా చేస్తుండగా,మన్మధుడు ఫేమ్ అన్షు రావు రమేష్,మురళి శర్మ కీలక పాత్రలు పోషించారు.సామజవరగమన,ఊరుపేరు భైరవకోన వంటి హిట్ చిత్రాలని నిర్మించిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్,హాస్య బ్యానర్ కలిసి మరోమారు సంయుక్తంగా 'మజాకా' ని నిర్మిస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.ఈ మూవీకి సంబంధించిన 'రాములమ్మ' అనే పాట మేకింగ్ వీడియోని యు ట్యూబ్ లో ప్రేక్షకుల కోసం ఉంచింది.మేకర్స్ ఈ పాటని ఎలా చిత్రీకరిస్తున్నారు,నటీనటులతో పాటు మిగతా టెక్నీషియన్స్ సాంగ్ లో ఈ విధంగా లీనమయ్యి వర్క్ చేస్తున్నారని ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఉంది.
ఇక ఇదే వీడియోలో త్రినాథరావు నక్కినతో పాటు, అనిల్ సుంకర,రాజేష్ దండ,సందీప్ కిషన్, రీతు వర్మలు సినిమాకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నారు.ఫిబ్రవరి 26 న మూవీ విడుదల కానుండగా,ప్రచార చిత్రాలుతో పాటుట్రైలర్ కూడా బాగుండటంతో మూవీ పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి.

![]() |
![]() |