![]() |
![]() |
ఏడు నెలల క్రితం రాజ్ తరుణ్, లావణ్య మధ్య ఏర్పడిన వివాదం... ఆ తర్వాత వారి మిత్రుడైన మస్తాన్ సాయికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్నాళ్ళు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. తాజాగా మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టడంతో మరోసారి వీరి వివాదం తెరపైకి వచ్చింది. మస్తాన్ తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, వీడియోలు కూడా తీశాడని తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అంతేకాదు, అతని దగ్గర కొన్ని వందల్లో అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపింది. దానికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ని కూడా పోలీసులకు అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు 3 రోజుల కస్టడీ కోసం అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తను చేసిన దారుణాల గురించి మస్తాన్ సాయి పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోల గురించి అడిగినపుడు తను ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోలు తీశానని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు, అమ్మాయిల కోసం పార్టీలు ఏర్పాటు చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసానని కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. వారు మత్తులో ఉన్నప్పుడు వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఆ వీడియోల ద్వారా వారినే బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు తీసుకోవాడినని మస్తాన్ సాయి అంగీకరించాడట. ఇక డ్రగ్స్ గురించి వివరిస్తూ బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తానని, అయితే తాను ఎవరికీ సరఫరా చేయలేదని, తన పార్టీల కోసమే వాటిని ఉపయోగించేవాడినని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
లావణ్యతో మస్తాన్‌సాయికి ఉన్న పరిచయం గురించి కూడా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి పలు మార్లు అత్యాచారం చేసినట్టు మస్తాన్ సాయి అంగీకరించాడట. అయితే ఆమెను బలవంతం చేయలేదని, ఆమె అంగీకారంతోనే ఆ పని చేసినట్టు చెప్పాడట. పోలీసుల విచారణకు మస్తాన్ సాయి పూర్తిగా సహకరించడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడని తెలుస్తోంది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని మళ్ళీ చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.
![]() |
![]() |