![]() |
![]() |
.webp)
'విజయ్ దేవరకొండ'(Vijay Devarakonda)ప్రస్తుతం జెర్సీ ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి' దర్సకత్వంలో 'కింగ్ డమ్'(King Dom)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల క్యూరియాసిటీని కలగ చేస్తుంది. విజయ్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న 'మహాకుంభమేళా'లో పాల్గొన్నాడు.
తాజాగా విజయ్ ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాధుడిని సందర్శించడం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ని 'ఎక్స్' వేదికగా షేర్ చేస్తు' 2025 కుంభమేళాలో నా ప్రయాణం,మన ఇతిహాసహాసాలకి మూలాలని తెలుసుకునే విధంగా కొనసాగింది.అమ్మతో కలిసి పూజలు కూడా చెయ్యడం,నాకు ఇష్టమైన గ్యాంగ్ తో కాశీ రావడం,మరిచిపోలేని అనుభూతిని మిగిలిచిందంటూ ట్వీట్ చేసాడు.
విజయ్ షేర్ చేసిన పిక్స్ లలో ఆయన తల్లితో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)భార్య స్నేహరెడ్డి, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipally)మరికొంత మంది స్నేహితులు ఉన్నారు. స్నేహరెడ్డి కూడా విజయ్ షేర్ చేసిన ఫోటోలని 'ఎక్స్' వేదికగా షేర్ చేసింది.
![]() |
![]() |