![]() |
![]() |
.webp)
ఈ వారం కూడా సిల్వర్ స్క్రీన్ తో పాటు ఓటిటి లో పలు చిత్రాలు,వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి.పైగా అవన్నీ కూడా దేనికవే డిఫరెంట్ కథాంశాలతో కూడినవి కావడంతో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందనుంది.మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
'లవ్ టుడే' మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు పొందిన తమిళ హీరో ప్రదీప్ రంగరాజన్. ఈ నెల 21 న మరోసారి 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీతో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు.'అనుపమ పరమేశ్వరన్',కయదు లోహర్ హీరోయిన్లు కాగా,ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీ ని కలిగించేలా ఉన్నాయి.ఇదే రోజు వర్సటైల్ నటుడు సముద్రఖని,ప్రముఖ నటుడు ధనరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రామం రాఘవం' కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది.తండ్రి,కొడుకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.ధనరాజ్ ఫస్ట్ టైం దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' కూడా ఈ నెల 21 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.పవిష్,అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్,మద్యు థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించగా లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన 'బాపు' ఏ ఫాథర్ సూసైడ్ స్టోరీ; కూడా 21 నే థియేటర్స్ లో సందడి చేయనుంది.బ్రహ్మాజీ, ఆమని, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి,అవసరాల శ్రీనివాస్,ధన్య బాలకృష్ణన్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.పల్లెటూళ్ళో మానవ సంబంధాలు,డబ్బు అవసరం వచ్చినప్పుడు మనుషులు ఎలా మారతారు అనే నేపధ్యం చుట్టూ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక ఓటిటి వేదికగా చూసుకుంటే
నెట్ ఫ్లిక్స్ లో
ఫిబ్రవరి 20 న జీరోడే అనే అమెరికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఫిబ్రవరి 21 న నందమూరి బాలకృష్ణ వన్ మాన్ షో 'డాకు మహారాజ్'(Daku Maharaj)
అమెజాన్ ప్రైమ్
ఫిబ్రవరి 20 న రీచర్ 3 అనే అమెరికన్ యాక్షన్ క్రైమ్ వెబ్ సిరీస్
డిస్ని +హాట్ స్టార్
ఫిబ్రవరి 17 న 'ది వైట్ లోటస్ అనే అమెరికన్ బ్లాక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్
ఫిబ్రవరి 20 న "ఉప్స్ ఆప్ క్యా అనే హిందీ వెబ్ సిరీస్
ఫిబ్రవరి 21 న 'ఆఫీస్ 'అనే తమిళ వెబ్ సిరిస్
జీ 5
ఫిబ్రవరి 21 న క్రైమ్ బీట్ అనే హిందీ వెబ్ సిరీస్
ఆపిల్ టీవీ ప్లస్
ఫిబ్రవరి 21 న సర్ఫేస్ 2 అమెరికన్ వెబ్ సిరీస్
ఇలా ఈ వారం కూడా మూవీ లవర్స్ కి కావాల్సినంత సినీ వినోదం అందనుంది
![]() |
![]() |