![]() |
![]() |

విశ్వక్ సేన్(Vishwak Sen)ఆకాంక్ష శర్మ(Akansha Sharma)హీరో హీరోయిన్లు గా రామ్ నారాయణ్(Ram Narayan)దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా(Laila).ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచే ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.భారీ డిజాస్టర్ దిశగా దూసుకెళ్లబోతుందని కూడా ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీ తొలి రోజు 1 కోటి పాతిక లక్షల నెట్ ని వసులు చేసినట్టుగా తెలుస్తుంది.ప్రచార చిత్రాలు,ట్రైలర్ బాగుండటంతో లైలా పై విశ్వక్ సేన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.పైగా మూవీలో విశ్వక్ ఆడ వేషం వెయ్యడంతో,ఈ సారి విశ్వక్ ఖాతాలో హిట్ పడటం ఖాయమని అనుకున్నారు.ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో ఆడ వేషం వేసుకున్న సినిమా ప్లాప్ అయిన దాఖలాలు లేవు.కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తు లైలా పరాజయం అంచున నిలబడింది.బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్,నాగినీడు,రఘుబాబు,అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
![]() |
![]() |