![]() |
![]() |

విక్కీ కౌశల్,(Vicky kaushal)రష్మిక(Rashmika Mandanna)ప్రధాన పాత్రలు పోషించగా 'లక్ష్మణ్ ఉటేకర్'(Lakshman Utekar)దర్శకత్వంలో దినేష్ విజయన్ (Dinesh Vijayan)నిర్మించిన చిత్రం 'చావా'(Chhaava)ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీ మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ(Chathrapathi Sivaji)మహారాజ్' తనయుడు ఛత్రపతి'శంభాజీ మహారాజ్'(Shambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.విడుదలైన అన్ని చోట్ల కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ తో ముంధుకు దూసుకుపోతుంది.
ఈ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా 31 కోట్ల నెట్ ని సాధించిందని, రాబోయే రోజుల్లో హిందీ చిత్ర పరిశ్రమలో మరిన్ని రికార్డులుని 'చావా' తన ఖాతాలో వేసుకుంటుందని,ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు.విక్కీ కౌశల్ కెరీర్ లో 'చావా'హయ్యస్ట్ ఓపెనింగ్ ని సాధించిన మూవీగా నిలబడటంతో పాటు,ఈ మధ్య కాలంలో హిందీలో హయ్యెస్ట్ ఓపెనింగ్ ని తెచ్చుకున్న మూవీగా కూడా చావా నిలిచింది.
విక్కీ కౌశల్, రష్మిక లు శంభాజీ మహారాజ్,యేసుబాయి క్యారెక్టర్స్ కి జీవం పోశారని ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.చివరి నలభై నిముషాలు అయితే మూవీ ఒక రేంజ్ లో ఉందని చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు.అక్షయ్ ఖన్నా,అశుతోష్ రానా,దివ్య దుత్త, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
![]() |
![]() |