![]() |
![]() |

మణిరత్నం(Mani Ratnam)దర్శకత్వంలో 2000 వ సంవత్సరంలో వచ్చిన 'సఖి'(Sakhi)మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన 'మాధవన్'(R madhavan)ఆ తర్వాత పలు తెలుగు,తమిళ,హిందీ సినిమాల్లో హీరోగా చేసి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎన్నో వైవిధ్యమైన క్యారక్టర్లని పోషిస్తు ఇప్పటి తరం యువనటులకి సవాలు కూడా విసురుతున్నాడు.
రీసెంట్ గా 'హిసాబ్ బరాబార్'(Hisaab Barabar)అనే సినిమా హిందీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 24 నుంచి జీ 5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.'రాధే మోహన్ శర్మ' క్యారెక్టర్లో మాధవన్ అద్భుతంగా నటించాడు.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతు నా బ్యాంకు బాలన్స్ ని నేను ఎప్పుడు చెక్ చేసుకోను.అలా తరచు చెక్ చెయ్యడం వల్ల ఉపయోగం ఉండదు.
ఎందుకంటే నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు తెలుసు కదా, కరోనా తర్వాత కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు.ఈ మధ్యనే ఒక పడవ కొన్నాను.దానికి లైసెన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చాడు.ఇక హిసాబ్ బరాబార్ మూవీ ని జియో స్టూడియోస్ నిర్మించగా అశ్వినిదీర్ (Ashwni dhir)దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |